Balakrishna: నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. వచ్చేస్తున్న బాలయ్య తనయుడు మోక్షజ్ఞ!

Nandamuri Balakrishnas son Mokshagna ready to enter tollywood
  • ఎన్‌బీకే 107 షూటింగ్ సెట్‌లో మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు
  • మోక్షజ్ఞను డైరెక్ట్ చేయనున్న రాహుల్ సాంకృత్యన్
  • కథ రెడీ చేస్తున్న దర్శకుడు!
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రముఖ నటుడు బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ త్వరలోనే టాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన కథ కూడా సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే నిజమైతే బాలయ్య అభిమానులకు పండుగే.

కాగా, ఎన్‌బీకే 107 షూటింగ్ సెట్‌లో ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు నిర్వహించడం ఊహాగానాలకు తెరలేపింది. బాలయ్య తనయుడి సినీ రంగ ప్రవేశం ఖాయమన్న ఊహాగానాలు అప్పుడే తెరపైకి వచ్చాయి. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఊహాగానాలే వచ్చినా అవేవీ నిజం కాలేదు. అయితే, ఈసారి మాత్రం మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అని చెప్పడమే కాకుండా డైరెక్టర్ పేరు కూడా తెరపైకి రావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
Balakrishna
Tollywood
Mokshagna
Rahul Sankrityan

More Telugu News