Elizabeth II: బ్రిట‌న్ దివంగ‌త రాణి ఎలిజ‌బెత్‌ 2తో టీడీపీ మ‌హిళా నేత ప్రతిభా భార‌తి.. ఇవిగో ఫొటోలు

Prathibha Bharathi as protocolminister for Elizabeth II hyderabad tour in 1983
  • 1983లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప్ర‌తిభా భార‌తి
  • అదే ఏడాది నవంబ‌ర్‌లో హైద‌రాబాద్ వ‌చ్చిన బ్రిట‌న్ రాణి
  • ప్రొటోకాల్ మంత్రి హోదాలో ఎలిజ‌బెత్‌- 2 వెంటే సాగిన మ‌హిళా నేత‌
బ్రిట‌న్ దివంగ‌త రాణి ఎలిజ‌బెత్ మ‌ర‌ణంతో ఆమెతో అనుబంధంపై లెక్క‌లేన‌న్ని జ్ఞాప‌కాలు క‌నిపిస్తున్నాయి. బ్రిట‌న్ రాణి హోదాలో ఎలిజ‌బెత్‌- 2 ఎక్కడెక్క‌డ ప‌ర్య‌టించారు? ఏఏ దేశాల‌కు ఎన్నెన్ని సార్లు వెళ్లారు? ఆయా ప‌ర్య‌టన‌ల్లో ఆమెతో క‌లిసిన వారు... ఇలా చాలా జ్ఞాప‌కాలను నెమ‌రువేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఉమ్మ‌డి ఏపీలో మంత్రిగా, అసెంబ్లీ స్పీక‌ర్‌గా ప‌నిచేసిన కావ‌లి ప్ర‌తిభా భార‌తి గురించిన జ్ఞాపకాలు కూడా వెల్ల‌డ‌య్యాయి. టీడీపీ త‌న సోష‌ల్ మీడియా వేదిక‌ల మీద ఎలిజ‌బెత్‌- 2తో ప్ర‌తిభా భార‌తి క‌లిసి ఉన్న ఫొటోల‌ను విడుద‌ల చేసింది.

1983లో టీడీపీ తొలిసారి అధికారం చేప‌ట్ట‌గా... నాడు శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ప్ర‌తిభా భార‌తికి ఎన్టీఆర్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కింది. అదే ఏడాది న‌వంబ‌ర్‌లో ఎలిజ‌బెత్‌- 2 హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు రాగా... ఏపీ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్రొటోకాల్ మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ప్ర‌తిభా భార‌తి... బ్రిట‌న్ రాణి ప‌ర్య‌ట‌న ఆద్యంతం ఆమె వెంటే సాగారు.
Elizabeth II
Prathibha Bharathi
TDP

More Telugu News