Oppo f21s pro: మైక్రో లెన్స్​ కెమెరా, పలుచని డిస్​ ప్లేతో ఒప్పో ఎఫ్​ 21 ఎస్​ ప్రో.. స్మార్ట్​ ఫోన్​ ప్రత్యేకతలు ఇవిగో

  • త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన ఒప్పో
  • మైక్రో లెన్స్‌ కెమెరాతో చిన్న వస్తువులను అతి దగ్గరి నుంచి ఫొటోలు తీయవచ్చని ప్రకటన
  • ప్రారంభ ఆఫర్‌ గా కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని వెల్లడి
Oppo f21s pro features and specifications

స్మార్ట్‌ ఫోన్ల తయారీ దిగ్గజమైన ఒప్పో తమ ఎఫ్‌ 21 శ్రేణిలో సరికొత్త మోడళ్లను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఎఫ్‌ 21ఎస్‌ ప్రో, ఎఫ్‌ 21ఎస్‌ ప్రో 5జీ ఫోన్లను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. మధ్యతరహా శ్రేణి స్మార్ట్‌ ఫోన్లలో మొట్టమొదటి సారిగా మైక్రో లెన్స్‌ సదుపాయాన్ని ఈ మోడళ్లలో అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించింది. మైక్రో లెన్స్‌ కెమెరాతో చిన్న చిన్న వస్తువులు, ఆకారాలను అతి దగ్గర నుంచి స్పష్టంగా ఫొటోలు తీయవచ్చని వెల్లడించింది.

ఎఫ్‌ 21ఎస్‌ ప్రో/ ఎఫ్‌ 21ఎస్‌ ప్రో 5జీ ఫోన్‌ ప్రత్యేకతలు ఇవీ..

  • ఈ ఫోన్‌ లో 6.4 అంగుళాల అమోలెడ్‌ ఫుల్‌ హెచ్‌ డీ ప్లస్‌ డిస్‌ ప్లేను అమర్చినట్టు ఒప్పో వెల్లడించింది. 90 హెడ్జ్‌ రీఫ్రెష్‌ రేటు, 180 హెడ్జ్‌ టచ్‌ సాంప్లింగ్‌ రేటుతో వీడియోలు, గేమ్స్‌ లో మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపింది.
  • కృత్రిమ మేధ ఆధారిత 64 మెగాపిక్సెల్‌ మెయిన్‌ కెమెరాతో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ను ఈ ఫోన్‌ లో అమర్చినట్టు ఒప్పో తెలిపింది. ఇందులో 2 మెగాపిక్సెల్‌ మైక్రో లెన్స్‌ కెమెరా, మరో 2 మెగాపిక్సెల్‌ డెప్త్‌ సెన్సర్‌ కెమెరా ఉన్నట్టు తెలిపింది.
  • ఫోన్‌ ముందు భాగంలో 32 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అమర్చినట్టు వెల్లడించింది.
  • క్వాల్‌ కోమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 680 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ తో.. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ అంతర్గత మెమరీ లభిస్తుందని వివరించింది.
  • ఈ ఫోన్‌ అతి తక్కువగా కేవలం 7.66 మిల్లీమీటర్ల మందంతో ఉన్నట్టు వివరించింది.
  • 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో 33 వాట్ల హైస్పీడ్‌ వూక్‌ చార్జింగ్‌ సపోర్టు ఉన్నట్టు పేర్కొంది.
  • చార్జింగ్‌ కోసం యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టు, హెడ్‌ ఫోన్స్‌ కోసం 3.5 ఎంఎం ఆడియో జాక్‌ ఉన్నట్టు తెలిపింది.
  • త్వరలోనే ఈ ఫోన్‌ ను విక్రయించనున్నట్టు ప్రకటించిన కంపెనీ.. మరికొన్ని ఫీచర్స్‌ ను, ధరల వివరాలను వెల్లడించాల్సి ఉంది.
  • అయితే ఫోన్‌ విక్రయాలు ప్రారంభమయ్యాక ప్రత్యేక ఆఫర్‌ కింద పలు క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌ స్టంట్‌ డిస్కౌంట్‌, నో కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్లు ఉంటాయని తమ వెబ్‌ సైట్లో పేర్కొంది.
  • ఒప్పో పరికరాలను ఎక్స్‌ చేంజ్‌ చేసుకుంటే రూ.3,000 వరకు అదనపు తగ్గింపు అందిస్తామని వెల్లడించింది.

More Telugu News