Rahul Gandhi: ప్రభువే నిజమైన దేవుడు అంటూ రాహుల్ గాంధీతో పలికిన మతగురువు... విమర్శనాస్త్రాలు సంధించిన బీజేపీ

BJP reaction on priest George Ponnaiah met Rahul Gandhi
  • కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
  • రాహుల్ ను కలిసిన మతగురువు జార్జ్ పొన్నయ్య
  • స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన జార్జ్ పొన్నయ్య అనే మతగురువు పలికిన మాటలపై బీజేపీ భగ్గుమంటోంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విట్టర్ లో పంచుకున్నారు. 

"శక్తి, తదితరుల వలె కాకుండా ఏసు ప్రభువే నిజమైన దేవుడు... అంటూ రాహుల్ తో జార్జ్ పొన్నయ్య పలికారు. ఈ వ్యక్తి గతంలో హిందువులపై విద్వేషం వెళ్లగక్కి అరెస్టయ్యాడు. అంతేకాదు, భరతమాత అపవిత్రతలు మమ్మల్ని అంటకుండా ఉండేందుకే నేను బూట్లు వేసుకుంటాను అని చెప్పింది కూడా ఇతడే. భారత్ జోడో యాత్ర చేయాల్సింది ఇలాంటి వాళ్లతోనేనా?" అంటూ షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News