నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు బండి సంజయ్ సన్నద్ధం... ఈ నెల 12న ప్రారంభోత్సవ సభ
- తెలంగాణలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ
- ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిన బండి సంజయ్
- పాదయాత్ర ఇప్పటివరకు మూడు విడతలు పూర్తి
- నాలుగోవిడతకు కుత్బుల్లాపూర్ లో శంఖారావం
ఈ నేపథ్యంలో, బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమయ్యారు. ఈ నెల 12న కుత్బుల్లాపూర్ రాంలీలా మైదానంలో ఉదయం 10 గంటలకు నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభోత్సవ సభ జరగనుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ హాజరుకానున్నారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ విభాగం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.