Motorola Edge: అదిరిపోయే డిజైన్ తో వస్తున్న మోటరోలా ఎడ్జ్ 30 సిరీస్ ఫోన్లు

Motorola Edge 30 Ultra Motorola Edge 30 Fusion to be launched in India on September 13
  • ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల కానున్న ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజన్ 
  • ఇప్పటికే యూరోప్ మార్కెట్లో వీటి విక్రయాలు
  • రూ.48 వేల నుంచి వీటి ధరలు ఉండొచ్చు
మోటరోలా తన ఎడ్జ్ సిరీస్ ఫోన్ల శ్రేణిని విస్తరించనుంది. ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పలు ధరల శ్రేణిలో వరుసగా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఖరీదైన శ్రేణిలో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను 13వ తేదీన విడుదల చేయనుంది. ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్ కు తోడు, వీటిల్లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 6.67 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ కర్వ్ డ్ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. క్వాల్ కామ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ 8 ప్లస్ జనరేషన్ 1ను ఇందులో ఏర్పాటు చేశారు. 200 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అలాగే, 50 మెగా పిక్సల్, 12 మెగా పిక్సల్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 60 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.

ఇక ఎడ్జ్ 30 ఫ్యూజన్ 6.55 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో రానుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ చిప్ సెట్ ఇందులో ఉంటుంది. 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. యూరోప్ లో ఇవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అక్కడి ధరల ప్రకారం ఎడ్జ్ 30 అల్ట్రా రూ.73వేలు, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఆరంభ ధర రూ.48,000గా ఉంది. 
Motorola Edge
Edge 30 Ultra
Edge 30 Fusion
Launching
India market

More Telugu News