Queen Elizabeth: బ్రిటన్ లో వింత.. క్వీన్ ఎలిజబెత్ రూపంలో ఆకాశంలో మేఘం

  • 96 ఏళ్ల వయసులో తనువు చాలించిన క్వీన్ ఎలిజబెత్
  • స్కాట్లాండ్ లోని వేసవి విడిది నివాసంలో తుదిశ్వాస విడిచిన రాణి
  • వైరల్ అవుతున్న ఎలిజబెత్ రాణి మేఘం ఫొటో
Queen Elizabeth spotted in clouds

బ్రిటర్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో యావత్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. చెక్కు చెదరని ఆమె చిరునవ్వును, ఆమె రాజసాన్ని అందరూ గుర్తుకు తెచ్చుకుంటున్నారు. 96 ఏళ్ల ఎలిజబెత్ రాణి స్కాట్లాండ్ లోని వేసవి విడిది నివాసంలో గురువారం కన్నుమూశారు. ఆమె మరణ వార్తను అధికారికంగా ప్రకటించిన తర్వాత లండన్ లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. 

లిన్నే అనే మహిళ తన 11 ఏళ్ల కుమార్తెతో కలిసి కారులో వెళ్తుండగా... ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్ రాణిని పోలిన మేఘం కనిపించింది. దీంతో... 'క్వీన్' అని గట్టిగా అరిచిన కుమార్తె తన తల్లికి ఆ దృశ్యాన్ని చూపించింది. ఎంతో ఆశ్చర్యపోయిన లిన్నే క్వీన్ మేఘాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. 

మరోవైపు, నిన్న రాణి అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్ర ధనుస్సులు కనిపించాయి. ఈ వింతను లండన్ ప్రజలు తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఇంధ్రధనుస్సుల మీదుగా రాణి స్వర్గానికి వెళ్లారని పలువురు కామెంట్ చేస్తున్నారు. 

More Telugu News