Bandi Sanjay: మన రాష్ట్రానికి వచ్చిన అతిథిని గౌరవించలేని సంస్కారహీనులు వీళ్లు: బండి సంజయ్

Bandi Sanjay condemns TRS worker act of mike bending during Himanta Biswa Sharma rally
  • హైదరాబాదు పర్యటనకు వచ్చిన అసోం సీఎం
  • ఎంజే మార్కెట్ వద్ద సభ
  • అసోం సీఎం నుంచి మైక్ లాగేసుకోబోయిన టీఆర్ఎస్ కార్యకర్త
  • తీవ్రంగా ఖండించిన బండి సంజయ్
  • తాము కూడా ఇదే రీతిలో బదులిస్తామని స్పష్టీకరణ
హైదరాబాదులో ఎంజే మార్కెట్ వద్ద అసోం సీఎం హిమంత బిశ్వశర్మకు ఊహించని అనుభవం ఎదురవడం తెలిసిందే. నందు బిలాల్ అనే టీఆర్ఎస్ కార్యకర్త హిమంత బిశ్వ శర్మ నుంచి మైక్ ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు అక్కడ్నించి తీసుకెళ్లారు. 

ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఘాటుగా స్పందిస్తూ.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. అసోం సీఎంను అడ్డుకుని ఏంచేయగలిగారని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రం నుంచి మన రాష్ట్రానికి వచ్చిన అతిథిని గౌరవించలేని సంస్కారహీనులు వీళ్లు అంటూ మండిపడ్డారు. ఇలాంటి వారికి హిందూ సమాజం ఎలాంటి గుణపాఠం చెబుతుందో తాము చూపిస్తామని హెచ్చరించారు. వారికి కూడా తాము అదే రీతిలో సమాధానమిస్తామన్న సంగతి గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక అధికారిక వేదికలపై, కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవాల్లో, సభల్లో ఈ దేశ ప్రధానిని తిడుతున్న విషయం గమనించాలని అన్నారు.
Bandi Sanjay
Himanta Biswa Sharma
TRS Worker
Rally
MJ Market
BJP
TRS
Hyderabad
Telangana

More Telugu News