Andhra Pradesh: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

AP Assembly sessions will start from 15th of this month
  • 15న ఉదయం 9 గంట‌ల‌కు అసెంబ్లీ ప్రారంభం
  • ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభం కానున్న మండ‌లి స‌మావేశాలు
  • 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్న ఉభ‌య స‌భ‌ల స‌మావేశాలు
ఆంధ్రప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15న ఉద‌యం 9 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యే శాస‌న‌స‌భా స‌మావేశాలు 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. అదే స‌మ‌యంలో ఈ నెల 15న ఉద‌యం 10 గంట‌ల‌కు ఏపీ శాస‌న మండ‌లి స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. మండ‌లి స‌మావేశాలు కూడా 5 రోజుల పాటు కొన‌సాగ‌నున్నాయి. 

ఈ స‌మావేశాల్లో 3 రాజ‌ధానుల‌కు సంబంధించిన బిల్లును స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే దిశ‌గా వైసీపీ స‌ర్కారు క‌స‌రత్తు చేస్తున్నట్టు సమాచారం. అదే విధంగా ప‌లు కీల‌క బిల్లుల‌ను కూడా ప్ర‌భుత్వం స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే అవ‌కాశాలు ఉన్నాయి.
Andhra Pradesh
YSRCP
AP Assembly Session

More Telugu News