Twitter: ట్విట్టర్ లో ట్వీట్.. 30 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకోవచ్చు..!

  • 30 నిమిషాల్లోపు ఐదు పర్యాయాలు ఎడిటింగ్ కు అవకాశం
  • ఎడిట్ చేసిన వాటిని యూజర్లు తెలుసుకునే ఏర్పాటు
  • ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ ఉన్న వారికే ఈ ఫీచర్
Twitter will let you edit your tweets but there is a limit

ట్విట్టర్ పై ఒక ట్వీట్ పెట్టిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవాలని భావించే వారి కోరిక త్వరలో తీరనుంది. ఎడిట్ ఫీచర్ ను తీసుకొస్తామని ట్విట్టర్ యజమాన్యం లోగడే ప్రకటించింది. ఈ ఫీచర్ ను అభివృద్ధి చేయడంతోపాటు కొద్ది మంది యూజర్ల ద్వారా ప్రయోగాత్మకంగా పరీక్షించి చూసినట్టు ట్విట్టర్ తాజాగా ప్రకటించింది. త్వరలోనే దీన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు బ్లాగ్ లో తెలిపింది.

ట్వీట్ చేసిన తర్వాత 30 నిమిషాల వరకు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆ సమయం మించిపోతే ఎడిట్ చేసుకోవడానికి ఉండదు. అలాగే 30 నిమిషాల్లోపు ఐదు సార్ల వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసిన ట్వీట్ అని అందరికీ తెలిసేలా దానికి ప్రత్యేకంగా ఐకాన్ కనిపిస్తుంది. దాంతో అసలు ట్వీట్ ఎడిటింగ్ కు గురైనట్టు యూజర్లకు తెలుస్తుంది. అంతేకాదు దానిపై ట్యాప్ చేస్తే ఎడిట్ హిస్టరీ కూడా కనిపిస్తుంది. 

కాకపోతే ట్విస్ట్ ఏంటంటే.. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ (వాస్తవానికి ఇది పెయిడ్ మెంబర్ షిప్) ఉన్న వారికేనట. మన దేశంలో బ్లూ సబ్ స్క్రిప్షన్ అందుబాటులో లేదు. అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ఎంపిక చేసిన దేశాలలోనే ఇది అందుబాటులో వుంది. కనుక ఈ ఫీచర్ యూజర్లు అందరికీ అందుబాటులోకి రావడానికి కొంత సమయం ఆగక తప్పదు.

More Telugu News