టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్... కొట్టివేసిన సుప్రీంకోర్టు
- అప్పట్లో లక్ష్మీపార్వతి పిటిషన్ హైకోర్టులో కొట్టివేత
- సుప్రీంకోర్టుకు వెళ్లిన లక్ష్మీపార్వతి
- చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలంటూ పిటిషన్
- ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి మీరెవరన్న న్యాయస్థానం
ఈ నేపథ్యంలో, లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం బెంచ్ విచారణ చేపట్టింది. అప్పట్లో హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పిటిషన్ ను కొట్టివేసిందని, పిటిషన్ లో లక్ష్మీపార్వతి ప్రస్తావించిన అంశానికి విలువ లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు, ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. ఎవరి ఆస్తుల వివరాలు ఎవరికి తెలియాలి? అంటూ వ్యాఖ్యానించింది.