హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు.. జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
- గత రాత్రి రెండు గంటలపాటు ఏకధాటిగా కురిసిన వర్షం
- ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్ల ఎత్తివేత
- మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
మరోవైపు, నగర శివారులోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇవి ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండడంతో ఈ రెండు జలాశయాల రెండు గేట్లను ఎత్తి మూసీనదిలోని నీటిని వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హిమాయత్ సాగర్ ఇన్‌ఫ్లో 500, ఔట్‌ఫ్లో 678 క్యూసెక్కులుగా ఉండగా, ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 600, ఔట్‌ఫ్లో 442 క్యూసెక్కులుగా ఉన్నట్టు తెలిపారు.