TDP: దేశంలోనే తొలిసారి పొలిటిక‌ల్ ఇంట‌ర్న్‌షిప్‌.. ఫ‌స్ట్ బ్యాచ్ యువ‌తుల‌తో నారా లోకేశ్ భేటీ

nara lokesh meets first batch of political internship ladies
షార్ట్స్‌లో చూడండి
భ‌విష్య‌త్తు రాజకీయ నేత‌ల‌ను తీర్చిదిద్దే స‌రికొత్త కార్య‌క్ర‌మానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. పొలిటిక‌ల్ ఇంట‌ర్న్‌షీప్ పేరిట‌ రాజ‌కీయాల్లో నిష్ణాతుల‌ను రూపొందించే ఈ కార్య‌క్ర‌మంలో దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన యువ‌తీ యువ‌కులు త‌మ శిక్ష‌ణ‌ను పూర్తి చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా తొలి బ్యాచ్‌కు చెందిన యువ‌తుల‌తో టీడీపీ అగ్ర నేత నారా లోకేశ్ గురువారం భేటీ అయ్యారు. వారితో తాను జ‌రిపిన భేటీకి సంబంధించిన ఫొటోల‌ను ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వారితో జ‌రిపిన చ‌ర్చ‌లు త‌న‌ను అమితానందానికి గురి చేశాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.
Go Back to Shorts
TDP
Nara Lokesh
Political Internship

More Telugu News