Sheikh Hasina: రాజ‌స్థాన్ క‌ళాకారుల‌తో క‌లిసి స్టెప్పులేసిన బంగ్లా ప్ర‌ధాని... వీడియో ఇదిగో

bngladesh pm Sheikh Hasina dance with traditional folk artists during her visit in Rajasthan

  • భార‌త ప‌ర్య‌ట‌న‌లో బంగ్లా ప్ర‌ధాని హ‌సీనా
  • అజ్మీర్ ష‌రీఫ్ ద‌ర్గాను సంద‌ర్శించిన వైనం
  • అజ్మీర్ ఎయిర్ పోర్టులో క‌ళాకారుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన బంగ్లా ప్ర‌ధాని

భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బంగ్లాదేశ్ ప్ర‌ధాన మంత్రి షేక్ హ‌సీనా గురువారం రాజస్థాన్‌లోని అజ్మీర్ ష‌రీఫ్ ద‌ర్గాను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా గురువారం మ‌ధ్యాహ్నం అజ్మీర్ ఎయిర్ పోర్టు చేరుకున్న హ‌సీనాకు స్థానిక అధికార యంత్రాంగం ఘ‌న స్వాగ‌తం ప‌లికింది. ఇందులో భాగంగా రాజ‌స్థానీ స్థానిక క‌ళాకారుల‌తో ఆమెకు రాజ‌స్థానీ సంప్ర‌దాయం ప్ర‌కారం స్వాగ‌తం ల‌భించింది.

ఈ సంద‌ర్భంగా రాజ‌స్థానీ సంప్రదాయ సంగీతానికి స్థానిక క‌ళాకారులు నృత్యం చేస్తూ హ‌సీనాకు స్వాగ‌తం ప‌ల‌క‌గా... హ‌సీనా కూడా క‌ళాకారుల ఉత్సాహంతో తానూ పాదం క‌దిపారు. వీరి నృత్యానికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Sheikh Hasina
Bangladesh
Ajmer Sharif Dargah
Rajasthan
  • Loading...

More Telugu News