Manchu Vishnu: 'జిన్నా' టీజర్ లాంచ్ ఈవెంట్ రేపే .. ఎక్కడంటే!

  • విష్ణు హీరోగా రూపొందుతున్న 'జిన్నా'
  • కథానాయికలుగా పాయల్ - సన్నీలియోన్
  • రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ 
  • త్వరలోనే విడుదల చేసే దిశగా సన్నాహాలు  
Ginna movie update

మంచు విష్ణు హీరోగా 'జిన్నా రూపొందుతోంది. సొంత బ్యానర్ పై ఆయన నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్య దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు సరసన నాయికలుగా పాయల్ - సన్నీలియోన్ అలరించనున్నారు. జి. నాగేశ్వరరెడ్డి కథను అందించిన ఈ సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లేను సమకూర్చాడు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి ముందుగా 'గాలి నాగేశ్వరరావు' టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత 'జిన్నా'గా టైటిల్ ను ఫిక్స్ చేశారు. రొమాంటిక్ కామెడీ టచ్ తో కూడిన యాక్షన్ ఎంటర్టయినర్ ఇది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. 

రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాదులోని AMB సినిమాస్ లో టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. త్వరలోనే ఈ సినిమాను థియేటర్లకు తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న విష్ణుకి ఈ సినిమా  హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News