Suhani Kalita: ‘యువర్స్ ఈవెంట్‌ఫుల్లీ’ సీఈవోను పెళ్లాడిన ‘మనసంతా నువ్వే’ బాలనటి సుహాని

Tollywood Child Actress Suhani kalita marries with vibhor hasija
  • బాలనటిగా తెలుగులో పలు సినిమాలు చేసిన సుహాని
  • హీరోయిన్‌గా రెండు సినిమాలు చేసిన నటి
  • ఢిల్లీకి చెందిన మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాతో వివాహం
  • కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటైన జంట
మనసంతా నువ్వే సినిమా చూసిన వారు అందులోని ‘తూనీగా.. తూనీగా’ సాంగ్‌ను మర్చిపోవడం కష్టం. ఆ పాటలో నటించిన సుహాని కలిత తాజాగా వివాహం చేసుకుంది. ఢిల్లీకి చెందిన సంగీతకారుడు, మోటివేషనల్ స్పీకర్ విభర్ హసీజాను పెళ్లాడింది. ‘యువర్స్ ఈవెంట్‌ఫుల్లీ’ అనే కంపెనీకి విభర్ సీఈవో అని సమాచారం. కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. సుహాని వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుండగా... ‘మీరేనా.. గుర్తించలేకపోయాం’ అంటూ వివాహ శుభాకాంక్షలు చెబుతున్నారు. 

సుహాని బాలనటిగా ‘బాల రామాయణం’, ‘గణేశ్’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ఎదురులేని మనిషి’, ‘ఎలా చెప్పను’ తదితర సినిమాల్లో నటించింది. 2008లో ‘సవాల్’ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఆ తర్వాత ‘స్నేహగీతం’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. అనంతరం ఆమె సినిమాలకు దూరమైంది.
Suhani Kalita
Vibhor Hasija
Manasanta Nuvve
Tollywood

More Telugu News