Vice President: ఉప‌రాష్ట్రప‌తితో బీహార్ సీఎం నితీశ్ కుమార్ భేటీ.. వీడియో ఇదిగో

  • 3 రోజులుగా ఢిల్లీలోనే మ‌కాం వేసిన నితీశ్
  • ఉప‌రాష్ట్రప‌తి జ‌గ‌దీప్ థ‌న‌క‌డ్‌తో భేటీకి వెళ్లిన వైనం
  • నితీశ్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన ఉపరాష్ట్రపతి ‌
గ‌డ‌చిన 3 రోజులుగా ఢిల్లీలోనే మ‌కాం వేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ... ప‌లు పార్టీల నేత‌ల‌తో వ‌రుస భేటీలు నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం సాయంత్రం ఆయ‌న భార‌త ఉపరాష్ట్రప‌తిగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌తలు చేప‌ట్టిన జ‌గ‌దీప్ ధ‌న‌క‌డ్‌తో భేటీ కోసం ఉప‌రాష్ట్రప‌తి నివాస్‌కు వెళ్లారు. 

త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన నితీశ్ కుమార్‌కు జ‌గ‌దీప్ ధ‌న‌క‌డ్ ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఉప‌రాష్ట్రప‌తి నివాస్ వ‌ద్ద‌కు నితీశ్ రాగానే... ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికిన ధ‌న‌క‌డ్... నితీశ్‌ను లోప‌లికి తీసుకుని వెళ్లారు. ఆ త‌ర్వాత త‌న ప‌క్క‌నే కూర్చునేందుకు నితీశ్‌కు కుర్చీ చూపించిన ధ‌న‌క‌డ్.. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో ఉత్సాహంగా మాట్లాడారు.
Vice President
Jagdeep Dhankhar
Bihar
Nitish Kumar
JDU

More Telugu News