Telangana: రామోజు హ‌ర‌గోపాల్‌కు ఈ ఏటి కాళోజీ పుర‌స్కారం

ramoju haragopal selected for this years kaloji award
  • తెలుగు భాష, తెలంగాణ సాహిత్యం కోసం కృషికి కాళోజీ పుర‌స్కారం
  • యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన కవి రామోజు హరగోపాల్
  • రామోజును అభినందిస్తూ క‌ల్వ‌కుంట్ల కవిత పోస్ట్‌
తెలంగాణ ప్ర‌జా కవి కాళోజీ నారాయ‌ణరావు పేరిట తెలంగాణ స‌ర్కారు అంద‌జేస్తున్న కాళోజీ పుర‌స్కారానికి రాష్ట్రానికి చెందిన ప్ర‌ముఖ క‌వి రామోజు హ‌ర‌గోపాల్ ఎంపిక‌య్యారు. కాళోజీ పుర‌స్కారం 2022కు రామోజును ఎంపిక చేస్తూ బుధ‌వారం తెలంగాణ ప్ర‌భుత్వం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

తెలుగు భాష, తెలంగాణ సాహిత్యం కోసం విశేషంగా కృషి చేసిన వారికి ఏటా కాళోజీ అవార్డు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన ప్రముఖ కవి రామోజు హరగోపాల్ ఎంపిక కావడం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు.
Telangana
Kaloji Puraskaram
Ramoju Haragopal
K Kavitha
TRS

More Telugu News