Congress: క‌న్యాకుమారి చేరిన రాహుల్ గాంధీ... మ‌రికాసేప‌ట్లో భార‌త్ జోడో యాత్ర‌

  • క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా భార‌త్ జోడో యాత్ర‌
  • 3,500 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌నున్న కాంగ్రెస్ అగ్ర నేత‌
  • క‌న్యాకుమారిలో రాహుల్‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికిన పార్టీ శ్రేణులు
rahul gandhi reacjes kanyakumari and will start bharat jodo yatra

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య‌మే ల‌క్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశం మొత్తాన్ని చుట్టేసేలా ఓ భారీ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భార‌త్ జోడో యాత్ర పేరిట క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా సాగే ఈ యాత్ర మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించింది. 

భార‌త్ జోడో యాత్ర‌ను ప్రారంభించేందుకు రాహుల్ గాంధీ కాసేప‌టి క్రిత‌మే త‌మిళ‌నాడులోని కన్యాకుమారికి చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నేత‌లు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం పార్టీ నేత‌ల‌తో యాత్ర‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను సమీక్షించిన రాహుల్‌... ఏర్పాట్ల‌పై సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ యాత్ర‌లో రాహుల్ గాంధీ 3,500 కిలోమీట‌ర్ల‌కు పైగా పాద‌యాత్ర చేయ‌నున్నారు.

More Telugu News