Amitabh Bachchan: ఈ వయసులోనూ రోజుకు 14 గంటలు పనిచేస్తున్న అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan says he shoots 14 hours a day after recovering from Covid 19
  • ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని
  • కేబీసీ కార్యక్రమంలో వెల్లడించిన అమితాబ్ బచ్చన్
  • తన కోసం ప్రార్థించిన వారికి ధన్యవాదాలు చెప్పిన బిగ్ బీ
కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను సుదీర్ఘ సమయం పాటు పనిచేస్తున్నట్టు బాలీవుడ్ వెటరన్ అమితాబ్ బచ్చన్ వెల్లడించారు. ఎంతో ప్రజాదరణ కలిగిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షో గురించి ఆయన మాట్లాడారు. అమితాబ్ బచ్చన్ ఇటీవల రెండోసారి కరోనా బారిన పడడం తెలిసిందే. కేబీసీ 14 లో తాజా ఎపిసోడ్ సందర్భంగా కంటెస్టెంట్ బ్రిజ్ కిషోర్ తన ఊపిరి సలపని ఉద్యోగ జీవితం గురించి ప్రస్తావించిన సందర్భంలో.. అమితాబ్ కూడా తన దినచర్య గురించి మాట్లాడారు.

ఉదయం 6 గంటలకు మొదలు రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ చెప్పారు. మన ఇద్దరిదీ ఒకటే స్థితి అంటూ పోల్చి చెప్పారు. గేమ్ ముగిసిన తర్వాత తిరిగొచ్చి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నట్టు అమితాబ్ తెలిపారు. కరోనా కారణంగా అమితాబ్ ఇటీవలే చిన్న బ్రేక్ తీసుకున్నారు. తాను ఐసోలేట్ అయ్యారు. తన కోసం ప్రార్థించిన వారందరికీ అమితాబ్ కేబీసీ కార్యక్రమం వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.
Amitabh Bachchan
14 hours
working
KBC

More Telugu News