Switzerland: స్విట్జర్లాండ్ లో ఎవరైనా కానీ.. ఇద్దరు కలసి పెళ్లి చేసుకోవచ్చు!

  • ఏక లింగ వివాహాలకు సైతం చట్టబద్ధత
  • మిగిలిన వారితో సమాన హక్కులు
  • ఇందుకోసం గతేడాది ప్రజాభిప్రాయ సేకరణ
  • అనుకూలంగా 64 శాతం మంది ఓటు
As same sex marriage is finally legal in Switzerland

లింగంతో సంబంధం లేకుండా స్విట్జర్లాండ్ లో ఎవరైనా ఇద్దరు కలసి పెళ్లి చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చట్టబద్ధమే. ‘వివాహం’ అంటే చట్టబద్ధమైన నిర్వచనాన్ని అక్కడ మార్చారు. వధువు, వరుడు కలవడం అని కాకుండా.. ఇద్దరు వ్యక్తుల సంగమంగా అక్కడ నిర్వచనం మార్చారు. ఇందుకోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం గతేడాది ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఎవరైనా కానీ ఇద్దరు వివాహం చేసుకునేందుకు అనుకూలంగా అక్కడ 64 శాతం మంది ఓటు వేశారు.

యూరోప్ లో ఆలస్యంగా ఈ విధమైన నిర్ణయం తీసుకున్న దేశం స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోవాలి. ఇప్పటికే యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్ లాండ్, బెల్జియం, ఐర్లాండ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, నార్వే, స్వీడన్ తదితర దేశాలు ఏక లింగ వివాహాలను ఆమోదించాయి. తాజా నిర్ణయంతో స్విట్జర్లాండ్ లో ఏక లింగ దంపతులకు సైతం మిగిలిన వారితో సమానమైన హక్కులు లభిస్తాయి.

More Telugu News