Jagan: కాసేపట్లో జగన్ అధ్యక్షతన ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశం

  • ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కేబినెట్ సమావేశం
  • కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
  • అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం
AP Cabinet meeting today

ఏపీ కేబినెట్ ఈరోజు భేటీ కాబోతోంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుంది. పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకోబోతున్నారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. అసెంబ్లీ సమావేశాలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానులపై చర్చించే అవకాశం కూడా ఉందని సమాచారం.

More Telugu News