INLD: 25న హర్యానాలో నేషనల్ లోక్‌దళ్ భారీ ర్యాలీ.. కేసీఆర్, చంద్రబాబుకు ఆహ్వానం

  • దేవీలాల్ జయంతి సందర్భంగా హర్యానాలో ర్యాలీ
  • ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యం
  • దేశంలోని పలువురు ప్రతిపక్ష నేతలకు ఆహ్వానం
INLD Invites Chandrababu and KCR to Haryana Rally

భారత మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్‌డీ) ఈ నెల 25న హర్యానాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి రావాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ఐఎన్ఎల్‌డీ ఆహ్వానించింది. వీరితోపాటు దేశంలోని పలువురు కీలక నేతలను ఆహ్వానించినట్టు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా తెలిపారు. 

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులను ఆహ్వానించినట్టు అభయ్ చౌతాలా తెలిపారు. ర్యాలీకి హాజరవుతామని నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారని చెప్పారు. జేడీయూ నేత కేసీ త్యాగి మాట్లాడుతూ.. ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి సమస్యలపై చర్చించనున్నట్టు చెప్పారు. బీజేపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ఐఎన్ఎల్‌డీ చీఫ్ ఓపీ చౌతాలా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News