Congress: బంగ్లాదేశ్ ప్ర‌ధానితో రాహుల్ గాంధీ భేటీ.. ఫొటో ఇదిగో

  • భార‌త ప‌ర్య‌ట‌న‌లో బంగ్లా ప్ర‌ధాని షేక్ హ‌సీనా
  • బంగ్లా ప్ర‌ధానితో ప‌లు అంశాల‌పై చ‌ర్చించిన రాహుల్‌
  • భార‌త్ జోడో యాత్ర‌కు ముందుగా హ‌సీనాతో రాహుల్‌ భేటీ
congress leader rahul gandhi meets bangladesh prime minister Sheikh Hasina

భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనాతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల మ‌ధ్య సంబంధాల‌పై వారిద్ద‌రి మ‌ధ్య అర్థ‌వంత‌మైన‌ చ‌ర్చ జ‌రిగిన‌ట్టు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన షేక్ హ‌సీనాతో భార‌త ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో పాటు ఇత‌ర రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు భేటీ అయ్యారు. 

ఈ క్ర‌మంలోనే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్‌కు చెందిన అగ్ర నేత‌గా రాహుల్ గాంధీ బంగ్లా ప్రధానితో భేటీ అయిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే... భార‌త్ జోడో యాత్ర పేరిట క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా సుదీర్ఘ పాద‌యాత్ర చేప‌ట్టేందుకు ఓ రోజు ముందుగా రాహుల్ గాంధీ బంగ్లా ప్ర‌ధానిని క‌ల‌వ‌డం గ‌మ‌నార్హం.

More Telugu News