TDP: చెన్నుపాటి గాంధీని ప‌రామ‌ర్శించిన నారా లోకేశ్‌

nara lokesh visits chennupati gandhi in hyderabad
  • ఇటీవ‌లే దాడిలో గాయ‌ప‌డ్డ గాంధీ
  • మెరుగైన చికిత్స కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన వైనం
  • మంగళవారం గాంధీని ప‌రామ‌ర్శించిన లోకేశ్
ఇటీవ‌ల రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల దాడిలో గాయ‌ప‌డ్డ టీడీపీ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీని మంగ‌ళ‌వారం ఆ పార్టీ అగ్ర నేత నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు. విజ‌య‌వాడ‌లో గ‌త వారం ప్ర‌త్య‌ర్థుల దాడిలో చెన్నుపాటి గాంధీ కంటికి గాయ‌మైన సంగ‌తి తెలిసిందే. ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత విజ‌య‌వాడ‌లోని ఎల్వీ ప్ర‌సాద్ కంటి ఆసుప‌త్రిలో ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుసత్రిలో చికిత్స తీసుకున్నారు.

ఈ క్రమంలో నారా లోకేశ్ మంగళవారం చెన్నుపాటి గాంధీని హైదరాబాద్ లో ప‌రామ‌ర్శించారు. కంటికి జ‌రుగుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. అన్నివిధాలా పార్టీ అండ‌గా వుంటుంద‌ని లోకేశ్ హామీ ఇచ్చారు. అధైర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, త్వ‌ర‌గా కోలుకుంటార‌ని ఆయ‌న ధైర్యం చెప్పారు.
TDP
Nara Lokesh
Vijayawada
Hyderabad
Chennupati Gandhi

More Telugu News