BJP: ఈ నెల 16న హైద‌రాబాద్‌కు అమిత్ షా... రెండు రోజుల పాటు భాగ్య‌న‌గ‌రిలోనే కేంద్ర హోం మంత్రి

amit shah tour in telangana starts on 16th of this month
  • ఈ నెల 17న ప‌రేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచ‌న దినం
  • ఈ వేడుక‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున హాజ‌రు కానున్న అమిత్ షా
  • బీజేపీ న‌గ‌ర శాఖ నేత‌ల‌తోనూ భేటీ కానున్న కేంద్ర మంత్రి

బీజేపీ అగ్ర నేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ నెల‌లో తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. ఈ నెల 16న హైద‌రాబాద్ రానున్న అమిత్ షా... రెండు రోజుల పాటు న‌గ‌రంలోనే ఉండ‌నున్నారు. ఈ నెల 17న తెలంగాణ విమోచ‌న దినాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ వేడుక‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున అమిత్ షా హాజ‌రు కానున్నారు. 

ఈ నెల 16న‌నే హైద‌రాబాద్ రానున్న అమిత్ షా... రాత్రికి న‌గ‌రంలోనే బ‌స చేస్తారు. ఈ నెల 17న తెలంగాణ విమోచ‌న దినంలో పాలుపంచుకోనున్న అమిత్ షా... అదే రోజు బీజేపీ న‌గ‌ర శాఖ‌కు చెందిన ప‌లువురు ప్ర‌తినిధుల‌తో భేటీ కానున్నారు. తెలంగాణ‌లో పార్టీ పటిష్ఠత‌పై దృష్టి సారించిన అమిత్ షా... న‌గ‌ర శాఖ ప్ర‌తినిధుల‌తోనూ అదే విష‌యంపై కీల‌క స‌ల‌హాలు, సూచ‌న‌లు చేయ‌నున్నారు.

  • Loading...

More Telugu News