Mahesh Babu: 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' ట్రైలర్ లాంచ్ చేసిన మహేశ్ బాబు

Mahesh Babu launches Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer
  • సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
  • మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చిత్రం
  • ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉందన్న మహేశ్
  • చూస్తుంటే ఆసక్తికరంగా ఉండేట్టుందని వెల్లడి
యువ హీరో సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై మహేంద్రబాబు, కిరణ్ బల్లాపల్లి నిర్మించారు. కాగా, తన బావ సుధీర్ బాబు నటించిన ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నేడు రిలీజ్ చేశారు. 

ఈ ట్రైలర్ ను విడుదల చేయడం సంతోషంగా ఉందని మహేశ్ బాబు తెలిపారు. చూస్తుంటే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉండేట్టుందని వ్యాఖ్యానించారు. సుధీర్ బాబు, కృతి శెట్టి, ఇంద్రగంటి మోహనకృష్ణలతో పాటు యావత్ చిత్రబృందానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ట్రైలర్ వీడియో లింకును కూడా మహేశ్ బాబు పంచుకున్నారు.
Mahesh Babu
Aa Ammayi Gurinchi Meeku Cheppali
Trailer
Sudheer Babu
Krithi Shetty
Tollywood

More Telugu News