Liz Truss: బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్... రిషి సునాక్ కు నిరాశ

Liz Truss elected as Britain new prime minister
  • కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా లిజ్ ట్రస్ ఎన్నిక
  • తద్వారా ప్రధాని పీఠం కూడా ట్రస్ కైవసం
  • చివరి వరకు పోటీ ఇచ్చిన సునాక్
  • బ్రిటన్ మూడో మహిళా ప్రధానిగా ట్రస్
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ సహచరుడు రిషి సునాక్ తో పోరులో లిజ్ ట్రస్ కే ఓటర్లు పట్టం కట్టారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్ కు 60,399 ఓట్లు లభించాయి. ప్రధాని పీఠం కోసం చివరివరకు బరిలో నిలిచిన భారత సంతతి రాజకీయవేత్త రిషి సునాక్ కు నిరాశ తప్పలేదు. 

లిజ్ ట్రస్ నిన్నటివరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. వివాదాలు, ప్రజావ్యతిరేకత కారణంగా బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్నిక చేపట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి అధినేతగా ఎన్నికయ్యే వ్యక్తే బ్రిటన్ ప్రధాని అవుతారన్న నేపథ్యంలో, లిజ్ ట్రస్ సొంత పార్టీ సభ్యులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచిపోతారు.
Liz Truss
Prime Minister
Britain
Rishi Sunak
Conservative Party

More Telugu News