Sharwanand: ప్రభాస్ .. చరణ్ లను రంగంలోకి దింపుతున్న శర్వా!

  • శర్వానంద్ తాజా చిత్రంగా 'ఒకే ఒక జీవితం'
  • టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ 
  • తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిన సినిమా  
  • ఈ నెల 9వ తేదీన సినిమా విడుదల
Oke Oka Jeevitam Movie Update

శర్వానంద్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఒకే ఒక జీవితం' రెడీ అవుతోంది. శ్రీకార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

ప్రభాస్ - చరణ్ లతో శర్వానంద్ కి మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన ఆ ఇద్దరి కోసం స్పెషల్ షో వేయడానికి శర్వా సిద్ధం చేస్తున్నాడట. ఆ సినిమా చూసి ప్రభాస్ .. చరణ్ స్పందించే తీరు ఈ సినిమాపై అంచనాలు పెంచుతుందని ఆయన భావిస్తున్నాడు. ఇద్దరిలో ఒకరు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని టాక్. 

ఇది కేవలం తల్లీ కొడుకుల ఎమోషన్స్ కి సంబంధించిన కంటెంట్ మాత్రమే కాదు, ఆ ఎమోషన్ అనేది టైమ్ ట్రావెల్ తో ముడిపడి నడుస్తుంది. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, అమల అక్కినేని .. నాజర్ .. వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

More Telugu News