Vijay: హీరోగా విజయ్ .. నిర్మాతగా కమల్!

  • 'వసూళ్ల వర్షాన్ని కురిపించిన 'విక్రమ్' మూవీ
  • విజయ్ హీరోగా కమల్ బ్యానర్ లో సినిమా 
  • దర్శకుడిగా వెట్రి మారన్ 
  • త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
Vijay in Kamal movie

కమలహాసన్ చాలా గ్యాప్ తరువాత తన సొంత బ్యానర్ పై నిర్మించిన 'విక్రమ్' .. విడుదలైన ప్రతి ప్రాంతంలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తనని ఈ సినిమా అప్పుల ఊబిలో నుంచి బయటపడేసిందని ఆయనే స్వయంగా చెప్పారు. అలాంటి ఆయన బ్యానర్ నుంచి మరో సినిమా రావడనికి రెడీ అవుతోంది.

అయితే ఈ సారి ఈ సినిమాలో హీరో కమల్ కాదు .. విజయ్. అవును.. ఆయనతో తన బ్యానర్లో ఒక సినిమా ఉండనుందని గతంలో కమల్ చెప్పారు. ఇప్పుడు అదే మాటను దర్శకుడు వెట్రిమారన్ కూడా చెప్పాడు. తన బర్త్ డే సందర్భంగా వెంట్రి మారన్ మాట్లాడుతూ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. త్వరలోనే తమ కాంబినేషన్ సెట్స్ పైకి వెళుతుందని స్పష్టం చేశాడు. 

ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ 'వారసుడు' సినిమా చేస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను లోకేశ్ కనగరాజ్ తో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు ఆల్రెడీ మొదలైపోయాయి. ఇక ఇప్పుడు వెట్రి మారన్ ప్రాజెక్టు కూడా లైన్లో ఉందని తెలుస్తోంది.

More Telugu News