Chandrababu: విజయవాడలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి... తీవ్రంగా స్పందించిన చంద్రబాబు

Chandrababu responds to attack on TDP leader Chennupati Gandhi
  • పటమటలంకలో ఘటన
  • వినాయక మండపాల వద్ద కూడా రక్తపాతం సృష్టిస్తున్నారన్న చంద్రబాబు
  • గాంధీ కంటికి గాయమైందని వెల్లడి
  • జగన్ ఏం సమాధానం చెబుతారంటూ ఆగ్రహం
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పటమటలంకలో టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరగడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై వైసీపీ రౌడీలు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాంధీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడినట్టు వెల్లడించారు. గాంధీ కంటికి తీవ్రగాయం అయిందని కుటుంబ సభ్యులు చెప్పారని వివరించారు. 

దాడి కారణంగా గాంధీ కంటిచూపునకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలిసి దిగ్భ్రాంతికి, తీవ్ర ఆవేదనకు గురయ్యానని చంద్రబాబు పేర్కొన్నారు. గాంధీకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు సూచించానని తెలిపారు. "వినాయక మండపాల వద్ద కూడా రక్తపాతం సృష్టించిన వైసీపీ రౌడీలపై ఏం చర్యలు తీసుకుంటారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. గాంధీపై దాడి చేసిన వైసీపీ రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలి" అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Chandrababu
Chennupati Gandhi
Attack
Jagan
Vijayawada
Andhra Pradesh

More Telugu News