O Meri Jaan: 'లక్కీ లక్ష్మణ్‘ చిత్రం నుంచి 'ఓ మేరీ జాన్' గీతాన్ని విడుదల చేసిన దర్శకుడు చందు మొండేటి

  • సోహైల్, మోక్ష జంటగా లక్కీ లక్ష్మణ్
  • ఏఆర్ అభి దర్శకత్వంలో చిత్రం
  • అనూప్ రూబెన్స్ సంగీతం
  • ఓ మేరీ జాన్ పాటను రాసిన భాస్కరభట్ల
  • ఆడియన్స్ నుంచి విశేష స్పందన
Chandu Mondeti launched O Meri Jaan song from Lucky Lakshman movie

చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీ ఫెలో అంటున్నా... తాను మాత్రం ఎప్పటికీ అన్‌ లక్కీ ఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో రూపొందిన ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘లక్కీ లక్ష్మణ్‌’. 

బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా ఏఆర్ అభి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. దత్తాత్రేయ మీడియా పతాకంపై  హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే  విడుదల చేయడానికి చిత్ర నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. 
కాగా, ఈ సినిమాలోని 'ఓ మేరీ జాన్... మనసే నువ్వే కావాలన్నదే...’ అంటూ సాగే లవ్ సాంగ్ ను 'కార్తికేయ' డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించగా, ఈ పాటకు ప్రముఖ రచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. సింగర్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. 'ఓ మేరీ జాన్' పాట విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రేక్షకుల నుండి అమోఘమైన స్పందన వస్తోంది. 

కాగా, ఈ చిత్రంలో రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, రచ్చ రవి, జబర్దస్త్ కార్తీక్ తదితరులు నటించారు.

More Telugu News