Vijay Devarakonda: ఈ స్టార్ క్రికెటర్ బయోపిక్ లో నటించాలనుకుంటున్నా: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda wanted to act in Virat Kohli biopic
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ
  • కోహ్లీ బయోపిక్ లో నటించాలని ఉందన్న విజయ్
  • కోహ్లీ పాత్రను తాను తప్ప మరెవరూ చేయలేరని వ్యాఖ్య

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. 'లైగర్' సినిమా పరాజయం పాలైనప్పటికీ... తన తదుపరి సినిమాల షూటింగుల్లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'జనగణమన', శివ నిర్వాణ దర్శకత్వంలో సమంతతో కలిసి 'ఖుషి' సినిమా చేస్తున్నాడు. తాజాగా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. త్వరలోనే తాను విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటిస్తానని చెప్పాడు. ఇప్పటికే ధోనీ బయోపిక్ ను సుశాంత్ రాజ్ పుత్ తో తీశారని, అందువల్ల కోహ్లీ బయోపిక్ ను చేయాలనుకుంటున్నానని... కోహ్లీ పాత్రను తాను తప్ప ఎవరూ చేయలేరని అన్నాడు. మరి, విజయ్ దేవరకొండ ఆకాంక్ష నెరవేరుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

  • Loading...

More Telugu News