: సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్

గుంటూరు జిల్లా సూర్యలంక బీచ్ ఫెస్టివల్ కు వేదిక కానుంది. జూన్ 22, 23 తేదీలలో సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి పనబాక లక్ష్మి బాపట్లలో మీడియాకు తెలిపారు. దీనికి కేంద్రమంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యన్నారాయణ హాజరవుతారని తెలిపారు. బాపట్ల పట్టణానికి ఆ పేరు వచ్చి 500 ఏళ్ల దాటిన సందర్భంగా ఉత్సవాల నిర్వహణపై త్వరలోనే వివరాలు తెలియజేస్తామన్నారు. ఇక ఎంపీలు వివేక్, మందా జగన్నాథం పార్టీ వీడడం దురదృష్టకరమన్నారు. పార్టీలోనే ఉండి తెలంగాణ సాధన కోసం ప్రయత్నిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

More Telugu News