Anchor Lasya: హాస్పిటల్ బెడ్ పై యాంకర్ లాస్య.. వీడియో ఇదిగో!

anchor Lasya Manjunath admitted to hospital
  • హాస్పిటల్ లో చేరిన విషయాన్ని వెల్లడించిన లాస్య
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన లాస్య భర్త
  • ఆమెకు ఏమయిందనేది వెల్లడించని లాస్య భర్త

ప్రముఖ టీవీ యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ లాస్య ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లాస్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని ఆమె భర్త మంజునాథ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో హాస్పిటల్ బెడ్ పై లాస్య పడుకొని ఉంది. ఆమెకు సెలైన్ ఎక్కిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే, ఆమెకు ఏమైందనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. మరోవైపు, ఆమె త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 

  • Loading...

More Telugu News