Telangana: రేపు ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ స‌మావేశం... తిరువ‌నంత‌పురం చేరిన మ‌హ‌మూద్ అలీ

Southern Zonal Council Meeting held in in kerala capital tomorrow
  • అమిత్ షా అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న స‌మావేశం
  • తిరువ‌నంత‌పురం చేరిన త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్‌
  • కేర‌ళ సీఎంతో క‌లిసి ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు
ద‌క్షిణాది రాష్ట్రాల జోన‌ల్ కౌన్సిల్ రెండో స‌మావేశం రేపు కేర‌ళ రాజ‌ధాని తిరువ‌నంత‌పురంలో జ‌ర‌గ‌నుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి తెలంగాణ త‌ర‌ఫున సీఎం కేసీఆర్‌కు బ‌దులుగా డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీ హాజ‌రవుతున్నారు. ఇప్ప‌టికే మ‌హ‌మూద్ అలీ శుక్ర‌వారం రాత్రికే తిరువ‌నంత‌పురం చేరుకున్నారు.

ఇదిలా ఉంటే... ఈ భేటీలో పాల్గొనేందుకు త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా శుక్ర‌వారం రాత్రికే తిరువ‌నంత‌పురం చేరుకున్నారు. ఆయనకు కేర‌ళ సీఎం పినర‌యి విజ‌య‌న్ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా రేప‌టి భేటీలో చ‌ర్చించాల్సిన ప‌లు అంశాల‌పై స్టాలిన్‌, విజ‌య‌న్‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. కేర‌ళ‌, త‌మిళ‌నాడుల మ‌ధ్య స‌త్సంబంధాల‌పైనా ఇద్ద‌రు సీఎంలు చ‌ర్చించారు.
Telangana
Tamilnadu
Kerala
Md Mahamood Ali
TRS
Stalin
Vijayan
Amit Shah

More Telugu News