Hyderabad: గ్యాంగ్ రేప్ కేసులో మైన‌ర్ నిందితుల‌ను మేజ‌ర్లుగా గుర్తించండి... నాంప‌ల్లి కోర్టులో పోలీసుల పిటిష‌న్‌

hyderabad police files a petition seeking gang rape miron victims as majors
  • మైన‌ర్ బాలిక‌పై గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డ ఐదుగురు మైన‌ర్లు
  • నిందితుల‌ను మేజ‌ర్లుగా గుర్తించాలంటూ పోలీసుల పిటిష‌న్‌
  • ఐదుగురికీ మెచ్యూరిటీ లెవెల్స్ అధికంగా ఉన్నాయ‌ని వెల్ల‌డి
  • పోలీసుల పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన నాంప‌ల్లి కోర్టు
హైద‌రాబాద్‌లో సంచ‌ల‌నం సృష్టించిన జూబ్లీ హిల్స్ ప‌బ్ గ్యాంగ్ రేప్ కేసులో శుక్ర‌వారం ఓ కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మైన‌ర్ బాలిక‌పై ఐదుగురు మైన‌ర్ల‌తో పాటు ఓ యువ‌కుడు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని జైలుకు త‌ర‌లించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాంప‌ల్లి కోర్టులో శుక్ర‌వారం ఓ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

గ్యాంగ్ రేప్‌న‌కు పాల్ప‌డ్డ ఐదుగురు మైన‌ర్ల‌ను మేజ‌ర్లుగా గుర్తించాల‌ని పోలీసులు త‌మ పిటిష‌న్‌లో కోర్టును కోరారు. ఐదుగురు నిందితుల‌కు మెచ్యూరిటీ లెవెల్స్ అధికంగానే ఉన్నాయ‌ని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా మేజ‌ర్లకు ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నీ కూడా నిందితుల‌కు ఉన్నాయ‌ని కోర్టుకు తెలిపారు. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన నాంప‌ల్లి కోర్టు త్వ‌రలోనే దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.
Hyderabad
Gang Rape
Hyderabad Police
Napally Court

More Telugu News