Boy: ఐస్​ క్రీమ్​ అందకుండా ఆడిస్తావా.. అంటూ గట్టిగా పట్టేసి లాక్కున్న బాల భీముడు.. వైరల్​ వీడియో ఇదిగో

Boy grabbed Ice cream rod tightly from seller Here is the viral video
  • చేతితోనో, చిన్నపాటి కర్రకు తగిలించో ఐస్ క్రీమ్ అందకుండా చేసే విక్రేతలు
  • కాసేపటి తర్వాత చేతికి ఇవ్వడం సాధారణమే..
  • దీనిపై కోపంతో ఐస్ క్రీమ్ రాడ్ ను పట్టేసుకుని లాక్కున్న ఓ బాలుడు
  • ట్విట్టర్ లో వైరల్ అయిన వీడియో
అక్కడక్కడా ఎగ్జిబిషన్లలోనో, ఐస్ క్రీమ్ లు అమ్మే ఔట్ లెట్ల వద్దనో ఓ దృశ్యం అలరిస్తూ ఉంటుంది. ఐస్ క్రీమ్ కోన్ లు అమ్మేవ్యక్తి.. అత్యంత చాక చక్యంగా ఐస్ క్రీమ్ చేతికి ఇస్తున్నట్టు ఇస్తూనే.. అందకుండా అటూ ఇటూ తిప్పుతూ సతాయించడం కనిపిస్తుంది. చాలా మంది అలా అటూ ఇటూ తిప్పుతున్న ఐస్ క్రీమ్ ను అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇదంతా ఏదో సరదాగా గడిచిపోతుంటుంది. అయితే ఓ బాలుడు మాత్రం ఈ ఐస్ క్రీమ్ ఆటను సీరియస్ గా తీసుకున్నాడు.
  • ఐస్ క్రీమ్ అమ్మే వ్యక్తి ఓ చిన్నపాటి కర్రకు కోన్ ఐస్ క్రీమ్ ను అంటించి అటూ ఇటూ తిప్పుతూ బాలుడిని సతాయించాడు.
  • దానిపై ఆగ్రహించిన బాలుడు గట్టిగా పట్టేసుకోవడంపై దృష్టిపెట్టాడు. ఐస్ క్రీమ్ ను కాకుండా ఆ ఐస్ క్రీమ్ ను అంటించి తిప్పుతున్న రాడ్ నే పట్టేసుకున్నాడు.
  • కాస్త బలంగా ఉన్న ఆ బాల భీముడు ఐస్ క్రీమ్ రాడ్ ను పట్టేసుకోవడంతో.. సదరు దుకాణం వ్యక్తి వెనక్కి లాగడానికి ప్రయత్నం చేసినా వీలు కాలేదు.
  • కాసేపు ఆ రాడ్ ను ఐస్ క్రీమ్ విక్రేత చేతి నుంచి లాగడానికి ప్రయత్నించిన బాలుడు.. చివరికి ఐస్ క్రీమ్ ను మాత్రం తీసుకుని వదిలిపెట్టాడు.
  • గెలిచిన ఆనందం మొహంలో కనిపిస్తుండగా.. ఐస్ క్రీమ్ ను కొరుకుతూ వెళ్లిపోయాడు. ఇదంతా కొందరు వ్యక్తులు వీడియో తీసి ట్విట్టర్ లో పెట్టారు.
  • ఈ వీడియోను ట్విట్టర్ లో ‘ఎక్స్ ట్రీమ్ లొల్’ అనే ఖాతాలో పోస్టు చేయగా.. కేవలం నాలుగు రోజుల్లోనే 95 లక్షల మందికిపైగా వీక్షించారు. 28 వేల మందికిపైగా రీట్వీట్ చేశారు. లక్షన్నరకుపైగా లైక్ లు రావడం గమనార్హం.

Boy
Grabbed Ice cream
Twitter
Viral Videos
Offbeat

More Telugu News