Trivikrama Verma: మంగళగిరి రూరల్ సర్కిల్, రూరల్ పోలీస్ స్టేషన్లలో డీఐజీ తనిఖీలు

  • వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలు
  • సిబ్బంది పనితీరు, క్రైమ్ రికార్డులను పరిశీలించిన త్రివిక్రమ వర్మ
  • క్లూస్ లేని కేసులను ఎఫర్ట్స్ పెట్టి ఛేదించాలని సూచన
DIG Trivikrama Varma inspects Mangalagiri Rural circle station

మంగళగిరి రూరల్ సర్కిల్ ఆఫీస్, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లను గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, సర్కిల్ పరిధిలోని అన్ని స్టేషన్లలో నిర్వహిస్తున్న కేసుల డైరీ, విలేజ్ రోస్టర్, క్రైమ్ రికార్డులను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్యాప్తు పూర్తయిన గ్రేవ్ కేసుల్లో ముద్దాయిలకు కచ్చితంగా శిక్ష పడే విధంగా కోర్టులో ఛార్జ్ షీట్లు వేయాలని పోలీసు అధికారులు సూచించారు. క్లూస్ లేని కేసులను ఎఫర్ట్స్ పెట్టి ఛేదించాలని చెప్పారు. లైసెన్సులు లేకుండా చిట్టీ వ్యాపారాలను చేసే వారిని నమ్మవద్దని ప్రజలకు సూచించారు. అత్యాశకు పోయి మోసపోవద్దని చెప్పారు.

More Telugu News