Punjab: ఆప్ పంజాబ్ ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌ను చాచిపెట్టి కొట్టిన భర్త.. వీడియో ఇదిగో

  • ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌కు, భర్తకు మధ్య వాగ్వివాదం
  • ఆగ్రహంతో భార్యపై దాడిచేసిన భర్త
  • సుమోటోగా స్వీకరిస్తామన్న మహిళా కమిషన్
  • ప్రజా సమస్యలపై గళమెత్తే మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమన్న చైర్ పర్సన్
AAP MLA Baljinder Kaur assaulted at home in Punjab

మహిళలపై నేరాలు దారుణంగా పెరిగిపోతున్నాయని జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) రెండు రోజుల క్రితమే ఓ నివేదిక విడుదల చేసింది. పంజాబ్‌లో మహిళలపై నేరాలు 17 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఆ నివేదికపై చర్చ జరుగుతుండగానే సాక్షాత్తూ ఆప్ మహిళా ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్‌పై దాడి జరిగింది. ఆమె ఇంట్లో జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చి వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహంతో స్పందిస్తున్నారు. 

ఆ వీడియో ప్రకారం..  భార్యతో వాదులాడుతున్న ఎమ్మెల్యే భర్తను కొందరు పట్టుకుని దూరంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేకు, కొంతమంది పురుషులకు మధ్య ఆమె ఇంటి వరండాలో వాగ్వివాదం జరుగుతోంది. అదే సమయంలో మెట్లపై కూర్చున్న ఆయన వద్దకు వచ్చిన బల్జిందర్ కౌర్ మళ్లీ వాగ్వివాదానికి దిగడంతో భర్త ఆమెపై దాడికి దిగాడు. చెంపపై బలంగా కొట్టాడు. 

ఈ వైరల్ వీడియో పంజాబ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి దృష్టిలో పడింది. దీనిని సుమోటోగా స్వీకరించి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడే ఓ మహిళ ఇంట్లో వేధింపులకు గురికావడం బాధాకరమని అన్నారు.

More Telugu News