స్నో వరల్డ్‌ను సీజ్ చేసిన తెలంగాణ పర్యాటక శాఖ
- ప్రభుత్వానికి రూ.16 కోట్ల మేర పన్ను బకాయి పడ్డ స్నో వరల్డ్
- నోటీసులు ఇచ్చినా స్పందించని పర్యాటక కేంద్రం
- మరో 16 పర్యాటక కేంద్రాలకూ నోటీసులు ఇచ్చామన్న పర్యాటక శాఖ
సర్కారు నుంచి జారీ అయిన నోటీసులను కూడా స్నో వరల్డ్ పట్టించుకోలేదు. దీంతో గురువారం రంగంలోకి దిగిన పర్యాటక శాఖ అధికారులు స్నో వరల్డ్‌ను సీజ్‌చేశారు. ఈ సందర్భంగా అధికారులు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని మరో 16 పర్యాటక కేంద్రాలు పన్ను బకాయిలు ఉన్నాయని తెలిపారు. నిర్దేశించిన గడువులోగా ఆ సంస్థలు కూడా పన్నులు కట్టకపోతే వాటిని కూడా సీజ్ చేస్తామని ప్రకటించారు.