Team India: కెప్టెన్‌గా కోహ్లీని దాటేసిన రోహిత్ శ‌ర్మ‌

rohit sharma stood in second place in t20 victories as team india captain
  • టీ20ల్లో భారత్‌కు అత్య‌ధిక విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ
  • నిన్న‌టిదాకా ఈ విష‌యంలో రెండో స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ
  • హాంకాంగ్‌పై విజ‌యంతో కోహ్లీని దాటేసిన రోహిత్ శ‌ర్మ‌
టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌, భార‌త జ‌ట్టు కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌... త‌న స‌హ‌చ‌ర ఆట‌గాడు, స్టార్ బ్యాట‌ర్, జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు. ఆసియా క‌ప్‌లో భాగంగా బుధ‌వారం హాంకాంగ్ జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియాను విజ‌య తీరాల‌కు చేర్చిన రోహిత్ శ‌ర్మ‌... టీ20ల్లో భార‌త జ‌ట్టుకు అత్య‌ధిక మ్యాచ్‌ల్లో విజ‌యాలు అందించిన కెప్టెన్‌గా రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా ఈ విష‌యంలో అత‌డు విరాట్ కోహ్లీని దాటేశాడు.

ఇప్ప‌టిదాకా టీ20ల్లో టీమిండియాకు కెప్టెన్ కూల్ మ‌హేంద్ర సింగ్ ధోనీ 41 విజ‌యాల‌ను అందించాడు. ధోనీ త‌ర్వాత కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకున్న కోహ్లీ... భార‌త జ‌ట్టుకు పొట్టి ఫార్మాట్‌లో 30 విజ‌యాల‌ను అందించాడు. బుధ‌వారం నాటి మ్యాచ్‌లో విజ‌యంతో రోహిత్ శ‌ర్మ‌... జ‌ట్టుకు 31 విజ‌యాల‌ను అందించిన కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాకుండా రోహిత్ నాయ‌క‌త్వం వ‌హించిన 37 మ్యాచ్‌లో టీమిండియా 31 మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.
Team India
Rohit Sharma
Virat Kohli
MS Dhoni
T20
Asia Cup

More Telugu News