David Warner: భారత్‌తో టీ20 సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆసీస్.. వార్నర్‌కు రెస్ట్

  • టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో వార్నర్‌కు విశ్రాంతి
  • అతడి స్థానంలో కేమరన్ గ్రీన్‌‌కు చోటు
  • ఈ నెల 20న మొహాలీలో తొలి మ్యాచ్
David Warner rested for three T20I series against India

ఈ నెల 20 నుంచి భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు విశ్రాంతి కల్పించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న వార్నర్‌ పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు అతడికి విశ్రాంతినిచ్చింది. వార్నర్ స్థానంలో కేమరన్ గ్రీన్‌కు చోటిచ్చింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ20 ఈ నెల 20న మొహాలీలో జరుగుతుంది. రెండో మ్యాచ్ 23 నాగ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ 25న హైదరాబాద్‌లో జరుగుతుంది. 
 
ఇటీవల జింబాబ్వేతో జరిగిన రెండు వన్డేల్లో వార్నర్ వరుసగా 57, 13 పరుగులు మాత్రమే చేశాడు. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)కు తొమ్మిదేళ్లపాటు దూరంగా ఉన్న వార్నర్ ఇటీవల సిడ్నీ థండర్‌తో రెండేళ్ల కాంట్రాక్ట్‌పై సంతకం చేశాడు. జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగే సిడ్నీ టెస్ట్ తర్వాత వార్నర్ సిడ్నీ థండర్‌లో చేరుతాడు. ఐదు మ్యాచ్‌‌లకు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. 

భారత్‌తో తలపడనున్న ఆసీస్ జట్టు ఇదే: 
ఆస్టన్ అగర్, పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), టిమ్ డేవిడ్, అరోన్ ఫించ్ (కెప్టెన్), జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిష్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కేన్ రిచర్డ్‌సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినెస్, మాథ్యూవేడ్, కేమరన్ గ్రీన్, ఆడం జంపా.

More Telugu News