మీ శరీరంలో యాంటీబాడీలు తగ్గిపోతున్నాయి.. త్వరగా బూస్టర్ డోసులు తీసుకోండి: ఎన్‌టాగి
- కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిలో 90శాతం మంది బూస్టర్ డోసు తీసుకోని వారేనన్న ఎన్‌టాగి చైర్మన్
- టీకాలు తీసుకుని 8 నెలలు అయిన వారు బూస్టర్ డోసు తీసుకోవాలని సూచన
- కరోనా ఇంకా చుట్టుముడుతూనే ఉందని వ్యాఖ్య
ప్రస్తుతం కొవిడ్‌తోపాటు పలు రకాల వైరస్లు కూడా వ్యాప్తిలో ఉన్నాయన్న ఆయన.. అవి తీవ్ర ప్రభావం చూపించకపోవడంతో మరణాల సంఖ్య బాగా తగ్గిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కరోనా వ్యాప్తి కొనసాగుతోందన్న విషయాన్ని మర్చిపోవద్దని, ప్రతి ఒక్కరు బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందాలని సూచించారు. అంతేకాదు, గత ఏడెనిమిది నెలల్లో ఆసుపత్రిలో చేరిన కరోనా రోగుల్లో 90శాతం మంది బూస్టర్ డోసు తీసుకోని వారేనని పేర్కొన్నారు.