Ranga Ranga Vaibhavanga: విడుదలై వారమైనా 'రంగ రంగ వైభవంగా' ట్రైలర్ కు ఏమాత్రం తగ్గని ప్రేక్షకాదరణ

Ranga Ranga Vaibhavanga trailer garners so many views till now
  • వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా రంగ రంగ వైభవంగా
  • ఇటీవల ట్రైలర్ రిలీజ్
  • యూట్యూబ్ లో గణనీయస్థాయిలో వ్యూస్ 
  • ఇప్పటిదాకా 7.6 మిలియన్ల వ్యూస్
  • పూర్తి వినోదాత్మక చిత్రంగా రంగ రంగ వైభవంగా
మెగా హీరో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా గిరీశాయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగ రంగ వైభవంగా. పక్కా కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్టయిన్ మెంట్, లవ్, రొమాన్స్... ఇలా అన్ని హంగులతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

కాగా, రంగ రంగ వైభవంగా చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 23న రిలీజైంది. ఈ ట్రైలర్ కు ఇప్పటికీ ప్రేక్షకాదరణ తగ్గలేదు. ఈ ట్రైలర్ వీడియో నమోదు చేస్తున్న వ్యూసే అందుకు నిదర్శనం. రంగ రంగ వైభవంగా థియేట్రికల్ ట్రైలర్ వీడియోకు ఇప్పటివరకు యూట్యూబ్ లో 7.6 మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. 

ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టయిన్ మెంట్ తో పాటు కావాల్సిన మేర ఎమోషన్స్ ను కూడా పండించినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కు బీజం వేసే టీజింగ్ దృశ్యాలు, కథలో అంతర్లీనంగా నడిచే కామెడీ, పాటలు, ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ పలికే డైలాగ్స్... ఇలా సినిమాను అన్ని ఎలిమెంట్స్ తో ప్యాక్ చేశారు. 

రిషి, రాధల పాత్రల చుట్టూ అల్లుకున్న అందమైన కథతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్లస్ అవుతుందనడంలో సందేహంలేదు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (ఎస్వీసీసీ) బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి.
Ranga Ranga Vaibhavanga
Trailer
Views
Vaishnav Tej
Ketika Sharma
Gireeshaya
Tollywood

More Telugu News