సోనియా గాంధీ తల్లి మృతి.. ఇటలీలో ముగిసిన అంత్యక్రియలు
- ఆగస్టు 27న మరణించిన పాలోవా మయానో
- నిన్న ఇటలీలో ముగిసిన అంత్యక్రియలు
- పార్టీ కీలక నేత జైరాం రమేశ్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వార్తలు
తాజాగా సోనియా గాంధీ తల్లి పాలోవా మయానో ఈ నెల 27న (శనివారం) మృతి చెందినట్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియా బుధవారం సాయంత్రం వార్తలు ప్రచురించింది. శనివారం మరణించిన పాలోవా మయానో అంత్యక్రియలు మంగళవారం (ఆగస్టు 30)న ముగిసినట్లు కూడా ఆయన తెలిపారు.