Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంట వినాయక పూజ.. ఫొటోలు ఇవిగో!

Megastar Chiranjeevi celebrates Vinayaka Chavithi at his home
  • నేడు వినాయక చవితి
  • తన ఇంట మట్టి గణపతి విగ్రహం ఏర్పాటుచేసిన చిరంజీవి
  • కుటుంబ సభ్యులతో కలిసి పూజలు
  • స్వామివారికి ఇష్టమైన నైవేద్యాల సమర్పణ
తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఊరూవాడా గణేశ్ మండపాలు ఏర్పాటు చేసిన భక్తులు, విఘ్నవినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలతో కోలాహలం నెలకొంది. కాగా, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో వినాయక చవితి పండుగ జరుపుకున్నారు. 

తమ పూజా మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్యను భక్తితో కొలుచుకున్నారు. తల్లి అంజనాదేవి, అర్ధాంగి సురేఖలతో కలిసి స్వామివారికి పూజలు చేశారు. తన ఇంట ఏర్పాటుచేసిన చిన్ని గణపతికి ఇష్టమైన పాయసం, పులిహోర, ఉండ్రాళ్లు, కుడుములు, వడలు, పండ్లు తదితర నైవేద్యాలు సమర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు. 

ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
Chiranjeevi
Vinayaka Chavithi
Celebrations
Tollywood

More Telugu News