Power Glance: పవన్ కల్యాణ్ పుట్టినరోజున 'హరిహర వీరమల్లు' నుంచి 'పవర్ గ్లాన్స్'

Power Glance from Harihara Veeramallu on Pawan Kalyan birthday
  • పవన్ కల్యాణ్ హీరోగా 'హరిహర వీరమల్లు'
  • క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామా 
  • సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు
  • అభిమానులకు స్పెషల్ ట్రీట్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'హరిహర వీరమల్లు'. పీరియాడిక్ యాక్షన్ డ్రామా జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కరోనా సంక్షోభం నేపథ్యంలో పలుమార్లు ఈ చిత్రం షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది.

కాగా, సెప్టెంబరు 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 'హరిహర వీరమల్లు' నుంచి పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 2 సాయంత్రం 5.45 గంటలకు ఈ చిత్రం నుంచి 'పవర్ గ్లాన్స్' విడుదల కానుంది. ఇందులోని కంటెంట్ పవన్ అభిమానులను ఉర్రూతలూగించడం ఖాయమని చిత్రబృందం భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్రబృందం తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. 

భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పై ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ అగ్రశ్రేణి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
Power Glance
Harihara Veeramallu
Pawan Kalyan
Birthday
Krish
Tollywood

More Telugu News