తగ్గేదేలే.. పుష్ప గణేశ్, ఆర్ఆర్ఆర్ గణేశ్.. వినాయక నవరాత్రుల్లో టాలీవుడ్ హవా!
- దేశవ్యాప్తంగా పలు చోట్ల భిన్నమైన పోజుల్లో వినాయక విగ్రహాలు
- సినిమాల్లో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను పోలినట్టుగా రూపకల్పన
- నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్న గణేశ్ విగ్రహాలు
అల్లూరి, భీం, పుష్పరాజ్ ల హవా..
- పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్ర పోషించిన అల్లు అర్జున్ డైలాగ్ ‘తగ్గేదేలే..’. పలు చోట్ల ఇదే పుష్పరాజ్ పాత్ర ఆహార్యంలో.. అదే జుట్టు, వస్త్రాలు, ఇతర లక్షణాలతో.. తగ్గేదేలే అంటూ గడ్డంపై చేయి పెట్టినట్టుగా ఉన్న గణేశ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది.
- ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించి వివిధ రూపాల్లోని గణేశ విగ్రహాలు అలరిస్తున్నాయి. సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ పరుగెడుతూ ఉన్నప్పటి తరహాలో, బాణాన్ని ఎక్కుపెడుతున్న తరహాలో రూపొందించిన గణేశ్ విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి.
