Komatireddy Raj Gopal Reddy: మునుగోడు ప్రజలు నా దేవుళ్లు.. వాళ్ల తీర్పును శిరసా వహిస్తా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Telangana people should put an end to KCR rule says Komatireddy Raj Gopal Reddy
  • ఈరోజు సతీ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజగోపాల్ రెడ్డి
  • కేసీఆర్ ను గద్దె దింపేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అంటూ ధీమా
రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు అంతం చేయాలని అన్నారు. మునుగోడు ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఎన్నిక అని చెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం జరుగుతున్న ఎన్నిక అని అన్నారు. 

కేసీఆర్ ను గద్దె దింపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబ పాలనకు తెర దించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలను తాను కోరుతున్నానని అన్నారు. మునుగోడు ప్రజలే తనకు దేవుళ్లని, వాళ్ల తీర్పును శిరసా వహిస్తానని చెప్పారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని ఈరోజు సతీసమేతంగా రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Komatireddy Raj Gopal Reddy
BJP
KCR
TRS
Munugode

More Telugu News